ఆయన ఓ స్టార్ హీరో. పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. కాకపోతే.. ఆ డాంబికాలు ఎప్పుడూ చూపించలేదు. `ఫలానా హీరోయిన్ నే తీసుకోండి..` అనే రికమెండేషన్లు ఎప్పుడూ చేయలేదు. కానీ ఓ కథానాయిక విషయంలో మాత్రం ఆయన మరీ… అతి శ్రద్ధ తీసుకుంటున్నాడన్నది టాలీవుడ్ టాక్. ఓ హీరోయిన్ తో గతంలో ఓ సినిమా చేశాడీయన. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. ఆ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లి, కుటుంబ సభ్యులతోనూ స్నేహం చేయించేంత అనుబంధాన్ని పెంచుకున్నాడు. తాను చేస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ల గురించి కసరత్తు సాగుతున్నప్పుడు `ఆమెను తీసుకోండి` అని దర్శక నిర్మాతలకు గట్టిగా రికమెండ్ చేశాడు. హీరో చెప్పాడు కాబట్టి, తప్పలేదు. దాంతో ఈ కాంబో మరోసారి సెట్టయ్యింది.
నిర్మాతతోనూ పర్సనల్ గా మాట్టాడి పారితోషికం గట్టిగా ఇప్పించాడని టాక్. ఆ కథానాయిక అర్హతను, సామర్థ్యానికి మించిన పారితోషికం హీరో రికమెండేషన్ తో ఇప్పించాల్సివచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై హీరోపై సదరు నిర్మాత కాస్త గుర్రుగానే ఉన్నాడట. ఇదంతా ఒక ఎత్తు. సెట్లో ఆ హీరో – హీరోయిన్ల వ్యవహార శైలి మరో ఎత్తు. వాళ్ల అనుబంధం చూస్తుంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందేమో..? అన్నంత అనుమానాలు రేగుతున్నాయట. ఆ హీరోయిన్ ది హైదరాబాద్ కాదు. కానీ మకాం, తదితర సౌకర్యాలన్నీ హీరోగారే దగ్గరుండి చూసుకుంటున్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ అనుబంధం ఎంత కాలమో మరి..?!