గుర్తుందా? 2019 మే 30వ తేదీన ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రంగం..!
” కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను…” ఆ ప్రకటనలోని పొల్లు పోకుండా మాటలు ఇవి.
సీఎం జగన్ చెప్పినట్లుగా పీపీఏలు రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ.. చంద్రబాబు వద్దే సీఎస్‌గా పని చేసి రిటైరన కల్లా అజేయరెడ్డి చూశారు. అయన అదే పనిగా ప్రెస్మీట్లు పెట్టి విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని వాదించారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండానే యూనిట్ రూ.2.72కు అందిస్తామని.. కంపెనీలు ముందుకు వచ్చాయని.. పీపీఏలు అవసరం లేదన్నారు. కానీ రెండేళ్లు తిరిగే సరికి బహిరంగ మార్కెట్లో రూ. ఇరవై పెట్టి కొనావాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత కొంతకాలంగా ప్రభుత్వం రూ.పది కన్నా ఎక్కువ రేటుకే కొనుగోలు చేస్తోంది. అందుకే ట్రూ అప్ చార్జీల భారం కూడా పడింది
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎనిమిది వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేశారు. కోర్టుల్లో కుదరకపోయినా కొనుగోలు మాత్రం ఆపేశారు. ఆ విద్యుత్ ధర యూనిట్‌కు నాలుగున్నర వరకూ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పవర్ ఎక్సైంజీల్లో రూ. ఇరవై పెట్టి కొంటోంది. పవర్ ఎక్సైంజీల్లో సెప్టెంబర్ 15 వరకు సగటున యూనిట్ రూ.4. 60 పైసలు ఉండగా ఇప్పుడు అది రూ.20కు చేరింది. బహిరంగ మార్కెట్లో డిమాండ్ సప్లయ్‌కు తగ్గట్లుగానే కరెంట్ చార్జీలు ఉంటాయి. ఏపీ సర్కార్ కొరత కారణంగా విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు తప్పడంలేదు. ఓ వైపు ఆర్థిక కష్టాలు మరో వైపు చేసిన తప్పులు మీద పడటంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.