ఈరోజే `మా` జడ్జిమెంట్ డే. నిన్న రాత్రి వరకూ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఈరోజు పోలింగ్ కూడా అంతే జోరుగా సాగుతోంది. 8 గంటలకు పోలింగ్ మొదలైతే.. తొలి గంటలోనే దాదాపు 30 శాతం ఓటింగ్ పూర్తయ్యింది. పవన్, చరణ్, చిరు, బాలయ్య లాంటి అగ్ర హీరోలంతా తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత పోలింగ్ ఈసారి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్ స్టార్లంతా వచ్చి ఓటు హక్కు వినిపియోగించుకోవొచ్చు.
ఈసారి ఓటింగ్ పెరగడానికి మరో కారణం కూడా ఉంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా ఈసారి ఓటింగ్ లో పాలు పంచుకుంటున్నారు. చాలామంది తెలుగు నటులు చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్లందరినీ ఓ ప్యానల్ రప్పించింది. వాళ్లకు రానుపోను విమాన టికెట్లు ఇచ్చి, ఫైవ్ స్టార్ హోటెల్ లో బస ఏర్పాటు చేసింది. శనివారం సాయింత్రంకల్లా… `మా` ఓటర్లు హైదరాబాద్ వచ్చేశారు. వాళ్లంతా.. ఆదివారం ఉదయమే ఓటు హక్కు వినియోగించుకుని, తిరుగు ప్రయాణం అవుతారు. ఇలా ఒక్కొక్క ఓటకు కోసం దాదాపుగా 20 వేల వరకూ ఖర్చు పెడుతున్నారు. అందుకే ఈసారి పోలింగ్ శాతం గణణీయంగా పెరగబోతోంది. రాత్రి 8 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.