హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లవ్‌లో పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తన ఇన్‌స్టా ఖాతాలో తన లవ్ స్టోరీని వెల్లడించారు. ఇంతకీ ఆమె లవ్‌లో పడింది ఎవరితీ అంటే జాకీ భగ్నానీతో. జాకీ .. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వసూభగ్నానీ కుమారుడు. నటుడు కూడా. అయితే ఇంకా పెద్దగా సక్సెస్ రుచి చూడలేదు. 2009లో ఎంట్రీ ఇచ్చినా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు.
చేసిన వాటిలో ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయితే నిర్మాతగా మాత్రం తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సరబ్ జీత్ సినిమాను జాకీ భగ్నానీనే ప్రొడ్యూస్ చేశారు. వరుణ్ ధావన్‌తో కూలీ నెంబర్ వన్, అక్షయ్ కుమార్‌తో బెల్ బాటమ్ వంటి సినిమాలను తీశారు. బాలీవుడ్ పార్టీల్లో తరచూ కనిపించే జాకీ భగ్నానీకి.. రకుల్ తో మంచి స్నేహం ఏర్పడింది.
రకుల్ కూడా బాలీవుడ్ పార్టీల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూంటారు. పైగా ఫిట్ నెస్ బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఈక్రమంలో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. సాధారణంగా బాలీవుడ్ నటులు పెళ్లి చేసుకునే వరకు తమ ప్రేమ విషయాన్ని గోప్యంగానే ఉంచుతారు. అయితే రకుల్ మాత్రం జాకీ భగ్నానీతో ప్రేమ విషయాన్ని వెల్లడించింది. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.