ఆధ్యంతం ఆసక్తిగా సాగిన `మా` ఎన్నికలలో చివరికి అధ్యక్ష పీఠం మంచు విష్ణునే వరించింది. ఆయన ప్రకాష్ రాజ్ పై ఘన విజయం సాధించారు. అయితే ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుల విషయానికొస్తే… విష్ణు టీమ్ పై ప్రకాష్ రాజ్దే ఆధిక్యం. విష్ణు ప్యానల్ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పదకొండు మంది సభ్యులు గెలుపొందారు. అంటే… క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందన్నమాట. ఈసారి ఎన్నికల్లో చెల్లని ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయని తెలుస్తోంది.
ఇతర కీలకమైన పదవుల విషయానికొస్తే… ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ (ప్రకాష్ రాజ్ ప్యానల్) విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి (విష్ణు ప్యానల్) ట్రెజరర్ గా శివ బాలాజీ (విష్ణు ప్యానల్) జనరల్ సెక్రటరీగా రఘుబాబు (విష్ణు ప్యానల్) గెలిచారు. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ (ప్రకాష్ రాజ్ ప్యానల్), గౌతమ్ రాజు విజయాన్ని అందుకున్నారు. విష్ణు ప్యానల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గెలిచారు. ప్రకాష్ రాజ్ టీమ్ నుంచి అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి విజయం సాధించారు.