ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న వారందరూ రొటీన్‌గా చేసే ప్రక్రియ అది. అయితే అనూహ్యంగా పత్రికల్లో మాత్రం ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. వాటిని టీటీడీ ఇవ్వలేదు.. ప్రభుత్వం ఇవ్వలేదు. ఇచ్చింది ఏ.జే . శేఖర్. తిరుమల పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మించిన గోమందిరంను ప్రారంభిస్తారు. ఈ గోమందిరాన్ని తన డబ్బుతో నిర్మించారు ఏ.జే.శేఖర్. దాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారని అన్ని పత్రికల్లోనూఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చేశారు. ఈ ఏ.జే.శేఖర్ ఎవరంటే.. అందరికీ తెలిసిన వ్యక్తే. కాకపోతే..అందరికీ ఆయన శేఖర్ రెడ్డిగా మాత్రమే తెలుసు.
శేఖర్ రెడ్డి అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది తమిళనాడుకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడే. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ దగ్గర నుంచి నేరుగా ఆయన ఇంటికి నోట్ల కట్టల లోడు చేరుకుంది. ఐటీ అధికారుల తనిఖీల్లో దొరికినా… సీబీఐ కేసులు పడినా క్లీన్ చిట్‌గా బయటకు వచ్చేంత పలుకుబడి ఆయనకు ఉంది. అప్పుటు టీడీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయనను లోకేష్ బినామీ అన్నారు. వైసీపీ తో పాటు పవన్ కల్యాణ్ కూడా అన్నారు. చివరికి జగన్ సర్కార్ వచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. ఎన్ని ఆరోపణలకు చేసినా మళ్లీ ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడి పదవి ఇచ్చేసింది జగన్ సర్కార్. ఇప్పుడు ఆయన రూ. కోట్లు వెచ్చించి పత్రికా ప్రకటనలు ఇచ్చారు.
శేఖర్ రెడ్డికి పదవి ఇవ్వడం నామోషీ అని ఫీలయిందేమో కానీ అప్పట్లో జగన్ మీడియా ఆయనకు ఏ.జే శేఖర్ అని పేరు పెట్టింది.ఆయన కూడా అదే పద్దతిని ఫాలో అయిపోతున్నారు. తమిళనాడులో ఆయన శేఖర్ రెడ్డినే. ప్రముఖ ఇసుక కాంట్రాక్టర్‌గా ఉన్న ఆయన ఏపీలో సిలికా గనులు దక్కించుకున్నారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఆయన తిరుమలలో గో మందిరం నిర్మాణానికి వెచ్చించిన సొమ్ము కన్నా అత్యధికంగా పత్రికలకు వెచ్చించి..జగన్ మెప్పును పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డులో చోటు కల్పించలేదు కానీ.. చెన్నై టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దేశం మొత్తం మీద ఇలాంటి ఐదు అడ్వయిజరీ బోర్డులుఉంటాయి. ఈ బోర్డుల ప్రెసిడెంట్స్ కి టీటీడీ బోర్డులో ప్రత్యేక అతిథుల హోదా ఉంటుంది. ఇప్పుడు శేఖర్ రెడ్డికి అది ఉంది.