హీరోయిన్ శ్రియ ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. విదేశీయుడ్ని పెళ్లి చేసుకుని చాలా కాలం అయింది. అయితే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. బిడ్డ కూడా పుట్టేశాడని.. ఆ బిడ్డకు ఏడాది అయిందని కూడా ఎవరికీ తెలియదు. నిన్ననే ఆమె చెప్పి కొన్ని వీడియోలు బయటపెడితేనే తెలిసింది. శ్రియ కూల్‌గా తాను తల్లయిన విషయాన్ని చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేశారు. మొదటిలాక్ డౌన్ సమయంలో భర్తతో కలిసి బార్సిలోనాలో ఉండిపోయిన ఆమె.. అక్కడ బిడ్డను కనేసింది.
ఆ సమయంలోనూ ఆమె తరచూవీడియోలు పోస్ట్ చేసేవారు. అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసేవారు. అయితే ఎప్పుడూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కానీ బిడ్డ విషయాన్ని కానీ బయట పెట్టలేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఇండియాకు వచ్చినా విషయాన్ని రహస్యంగానే ఉంచారు. భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండే శ్రీయ .. బహిరంగంగా ముద్దు ముచ్చట్లు కూడా జరిపేస్తూంటారు. ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా ఈ జంట దర్శించుకున్నారు.
కొన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో శ్రియ తను తల్లయిన విషయాన్ని వెల్లడించడం ఫ్యాన్స్‌కు షాక్ లాంటిదే. ఇష్టం సినిమాతో తొలి సారిగా తెలుగు తెరపై మెరిసిన శ్రియ అప్పట్నుంచి కుర్రకారు హాట్ ఫేవరేట్‌గానే ఉంది.