ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటి వరకూ రోజుకు మూడు షోలు.. యాభై శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉండేది. అయితే కొత్తగా కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారు జాము ఐదు గంటల వరకే కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు.
దసరా పండుగ సందర్భంగా విడుదలవుతున్న సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం రిలీఫ్ ఇవ్వనుంది. గురువారం మహాసముద్రం విడుదల కానుంది. కొంత కాలంగా సినీ పరిశ్రమ పెద్దలు నాలుగు షోలు, వంద శాతం ఆక్యుపెన్సీకి చాన్సివ్వాలని కోరుతూ వస్తున్నారు. అయితే కర్ప్యూ నిబంధనలు అమలు చేస్తూండటం వల్ల ప్రత్యేకంగా సినిమాలకు పర్మిషన్ ఇవ్వలేదు.
ఇప్పుడు కరోనా పరిస్థితులను సమీక్షించి కర్ఫ్యూ సడలింపు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తి వేశారు. టిక్కెట్ రేట్ల విషయంలో మాత్రం స్పష్టత లేదు. వకీల్ సాబ్ సినిమా విడుదలయినప్పుడు జారీ చేసిన జీవో ప్రకారమే టిక్కెట్ రేట్లను నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ రేట్లు గిట్టుబాటు కావని పెంచాలని నిర్మాతలు చాలా సార్లు ప్రభుత్వాన్ని కోరారు.