కుటుంబం అన్నాక గొడవులు ఉంటాయి. అయినా సర్దుకుపోతారు. సినిమా నటులు.. ఇండస్ట్రీలో కూడా అంతే. విభేదాలు ఉన్నా కలసి మెలిసి ఉంటారు. కానీ మా ఎన్నికల తర్వాత పరిస్థితి దిగజారింది. అసలు ఎక్కడ తేడా కొడుతుందోనని టాలీవుడ్ పెద్దలందరూ కాస్త ఆలోచించారు. వారికి తెలిసిన తేడా”నరేష్” . నరేష్ టాలీవుడ్‌ను చీల్చేందుకు పక్కాగా ప్రయత్నిస్తున్నాడని అందుకే వివాదాస్పద ప్రకటనలు చేస్తూ.. రెండు వర్గాలు కలిసి పని చేసే వాతావరణం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని నిర్ణయించుకున్నారు.
మంచు విష్ణు హడావుడిగా మా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. నిజానికి గెలిచిన అందరు కార్యవర్గ సభ్యులతో కలిసి మా కార్యాలయంలోకి వెళ్లి బాధ్యతలు తీసుకోవాలి. కానీ అలాంటి పని చేయకుండా హడావుడిగా ఒక్కడే బాధ్యతలు తీసుకోవడం వెనుక నరేష్ వ్యూహం ఉందని చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ కోర్టుకెళ్లే ఆలోచనలో ఉందని విష్ణుని హడావుడి పెట్టి ప్రమాణస్వీకారం చేయించారని అంటున్నారు. ఆ తర్వాత కొంత మందిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. విష్ణు కలిసి పనిచేసుకుందామని అంటున్నారు కానీ నరేష్ మాత్రం ఆగడం లేదు. వివాదాన్ని అంతకంతకూ పెంచే ప్రయత్నంలోనే ఉన్నారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొంతమంది సినీ పెద్దలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వారు నరేష్‌ను కంట్రోల్ చేసి.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌తో రాజీనామాలను ఉపసంహరింప చేసి రెండు వర్గాలు కలిసి పని చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే మా రాజకీయాల్ని రోడ్డున పడేయడంలో సక్సెస్ అయిన నరేష్ ఈ ప్రయత్నాలనూ జరగనిస్తారా అన్నది ఇప్పుడు సందేహం. నరేష్‌ను దూరం పెడితే టాలీవుడ్లో అంతా సర్దుకుంటుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అయితే వివాదాస్పద ప్రకటనలతో చెలరేగిపోతున్న నరేష్‌ను కంట్రోల్ చేయడం అంత తేలిక కాదేమోనని ఎక్కువ మంది అభిప్రాయం.