నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించాలనుకుంటున్న విజయగర్జన సభకు ఇంచార్జీగా కేటీఆర్‌ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ సభను నభూతో అన్నట్లుగా నిర్వహింప చేసిద.. దటీజ్ కేటీఆర్ అని అనిపించుకునే పనిలో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ప్రతి రోజు ఇరవై నియోజవకర్గాల బాధ్యులు, ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. జన సమీకరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. 25న జరిగే పార్టీ ప్లీనరీకి పార్టీ తరఫున హాజరయ్యే ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపుతారు. నవంబర్ 15న జరిగే తెలంగాణ విజయ గర్జన సభకు మాత్రం అందరూ రావాల్సి ఉంటుందని కేటీఆర్ చెబుతున్నారు.
జన సమీకరణ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆయన క్లాస్ తీసకుంటున్నారు. బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 27న జరిగే నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు లోపు ఈ సమావేశాలను పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభ కి ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా సభ్యులు హాజరవ్వాలని ఆదేశించారు. 22వేల బస్సులతో జన సమీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆ మేరకుప్రతి గ్రామం నుంచి బస్సును అందుబాటులో ఉంచేందుకు టీఆర్ఎస్ ముఖ్యులు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ హుజురాబాద్ ఫలితం కంటే ముందే జరుగుతుంది. అయితే బహిరంగసభ మాత్రం హుజురాబాద్ ఫలితం తర్వాత ఉంటుంది. ఆ ఫలితం ఎఫెక్ట్ సభపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ హుజురాబాద్ ఫలితం తేడా కొడితే సభ విషయంలో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్‌పై పడుతుంది. అందుకే రెండో తేదీ తర్వాత కేటీఆర్‌కు అసలు టాస్క్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.