ఇటీవల యువ నిర్మాత మహేష్ కోనేరు గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మహేష్ మృతితో.. టాలీవుడ్ షాక్ కి గురైంది. ఓరకంగా… చాలామంది గుండెలు కూడా ఉలిక్కిపడినట్టైంది. సాధారణంగా నిర్మాత సడన్ గా చనిపోతే.. ఫైనాన్షియర్లు బెంగ పడాలి. ఎందుంకంటే, ఆర్థిక లావాదేవీలన్నీ వాళ్లతోనే. కాకపోతే, మహేష్ వ్యవహారం వేరు. తన దగ్గర చాలామంది సినీ సెలబ్రెటీల పెట్టుబడులు ఉన్నాయట.
మహేష్ కోనేరు చాలామంది కి కావల్సిన వ్యక్తి. తనకు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ అనుబంధం తోనే కొంతమంది దర్శకులు మహేష్ కోనేరుకి అప్పులు ఇచ్చినట్టు తెలిసింది. వడ్డీలు పక్కాగా సెటిల్ చేస్తాడన్న భరోసా రావడంతో చాలామంది దీన్ని ఓ పెట్టుబడిగా భావించారు. టాలీవుడ్ లో మంచి పేరున్న ఓ దర్శకుడు మహేష్ కి దాదాపు 5 కోట్ల వరకూ అప్పు ఇచ్చాడట. ఓ రచయిత కోటి, ఓ సంగీత దర్శకుడు కోటిన్నర వరకూ మహేష్ కోరుకి అప్పులుగా ఇచ్చారు. వాటికి సంబంధించిన నెలవారీ వడ్డీలు బాగానే వచ్చేస్తుండడంతో – అసలు గురించిన బెంగ లేకపోయింది. అయితే.. సడన్ గా మహేష్ కోనేరు మృతి చెందడంతో అసలుకే ఎసరొచ్చింది. దాన్ని ఎలా రాబట్టుకోవాలో తెలీక…. ఇప్పుడు వాళ్లంతా సతమతమవుతున్నారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.