ఆచార్య తరవాత లూసీఫర్ రీమేక్ `గాడ్ ఫాదర్`ని పట్టాలెక్కించాడు చిరంజీవి. ఇప్పుడు `భోళా శంకర్`నీ సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అనిల్ సుంకర నిర్మాత. నవంబర్ 11న ఉదయం 7.45 గం.లకు ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో చిరు చెల్లాయిగా కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయిక, ఇతర నటీనటుల్ని త్వరలోనే ఎంపిక చేస్తామని చిత్రబృందం తెలిపింది. మణిశర్మ తనయుడు మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. 2022 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయవంతమైన వేదాళం చిత్రానికి ఇది రీమేక్. మరోవైపు బాబి దర్శకత్వంలో చిరు నటించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్నీ వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలన్నది చిరు ఆలోచన.