నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అలరించనున్నారు. ‘అన్స్టాపబుల్’ అనే ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు. ‘ఆహా’ఓటీటీ లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోలో బాలకృష్ణ అదరగొట్టారు.”నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్యసిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్పశుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు” అని బాలయ్య తనదైన శైలిలో చెప్పడంతో ప్రోమో ప్రారంభమైంది.
”మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ అలరిస్తోంది. ఆయన లుక్స్, స్టైల్ అభిమానుల్ని ఫిదా చేసేలా ఉన్నాయి. నవంబరు 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి తో అఖండ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి.