కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే, ప్రజలు తెలంగాణలో కలవాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఇటీవల కేటీఆర్ తో పాటు కొంత మంది టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు తెలంగాణలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ సర్కార్ కంటే కర్ణాటక ప్రభుత్వమే చాలా బెటరని .. అక్కడి రాయచూరు ఎమ్మెల్యేకు కృథజ్ఞతలు కూడా చెప్పి వచ్చారు.
తెలంగాణలో కర్ణాటకకు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో చేగుంట, కున్సి గ్రామాలు కర్నాటక రాష్ట్రం అయిన యాదగిరి, రాయిచూరు హైవేపై ఉంటాయి. ఈ రెండు గ్రామాలకు బస్సు సౌకర్యం ఇబ్బందికరంగా మారింది. హైవేపై ఉండటం వల్ల కర్ణాటక బస్సుల్నే ఎక్కువ ఉపయోగించుకుంటారు. కానీ అక్కడ కర్ణాటక బస్సులకు స్టాప్ లేదు. దీంతో వారు కర్ణాటక ప్రాంతానికి టిక్కెట్ తీసుకుని తమ గ్రామంలో దిగారి. దీని వల్ల ఖర్చు ఎక్కువైపోతోంది.
బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలగాణకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా.. అంత దూరం బస్సును పంపితే మళ్లీ వెనక్కి ఖాళీగా రావాల్సి వస్తుంది కాబట్టి కర్ణాటక బస్సుల్నే వాడుకోవాలని చేతలతోనే తేల్చేశారు. దీంతో అక్కడి ప్రజలు కర్ణాటక ఆర్టీసీనే కలిసి తమ గ్రామం వరకూ టిక్కెట్లు తీసుకునేలా స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. వారు నేరుగా రాయిచూరు ఎమ్మెల్యేనే అడిగారు. వెంటనే ఉత్తర్వులు కూడా ఎమ్మెల్యే ఇప్పించారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు కర్ణాటకనే బెటరని ప్రకటించేశారు. దీంతో చెల్లుకు చెల్లయినట్లయింది.. అటూ ఇటూ కలపాలనే డిమాండ్ల విషయంలో అని రెండు వైపులా సరి పెట్టేసుకున్నారు.