స్వామిరారాతో టాలీవుడ్ లో తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు సుధీర్ వర్మ. `కేశవ` ఓకే అనిపించుకుంది. అయితే రణ రంగం మాత్రం దారుణంగా దెబ్బకొట్టింది. కాస్త విరామం తరవాత ఇప్పుడు రవితేజతో ఓసినిమా చేసున్నాడు. రవితేజ నటించే 70వ సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాత. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ఈ రోజు విడుదల చేశారు. `హీరోస్ డోన్ట్ ఎగ్జిట్` అంటూ.. ఈ కథని టూకీగా చెప్పే ప్రయత్నం చేశారు. దేవాలయాలపై ఉన్న బొమ్మల్ని ఫోకస్ చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇదంతా చూస్తుంటే సుధీర్ వర్మ మళ్లీ క్రైమ్ కామెడీ జోనర్ ని టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈనెల 5న టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్నీ విడుదల చేయబోతున్నారు. `మాస్ మహా మేకొవర్`ని చూడబోతున్నారంటూ… చిత్రబృందం ఓ హింట్ కూడా ఇచ్చేసింది. అదెలా ఉంటుందో చూడాలి మరి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా` చిత్రాలతో బిజీగాఉన్నాడు రవితేజ.