‘‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం’’ ఇదీ నందమూరి బాలకృష్ణలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అతిథిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో బాలయ్య అదరగొట్టారు. సరికొత్త జోష్ లో కనిపించారు. ఈ ప్రోమో చాలా మసాలా దట్టించారు. ‘మీరు నటించిన చిత్రాల్లో అస్సలు చూసుకోలేని చిత్రమేది?’’ అని బాలకృష్ణ ప్రశ్నించగా.. ‘‘పటాలం పాండు’’ అని మోహన్‌బాబు సమాధానం చెప్పగానే.. ‘‘బాగా రాడ్డు రంభోలానా ? ’’ అంటూ బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది.
ఈ ప్రోమోలో పొలిటికల్ ప్రశ్నలు కూడా వచ్చాయి. మోహన్ బాబు, బాలయ్య కి ఓ ప్రశ్న వేస్తూ.. తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు.. ఆయన తర్వాత ఆ పగ్గాలు నీవు పట్టుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చావ్ ? అనగా.. మరి అన్నగారి పార్టీ వదిలేసి వేరే పార్టీలో ఎందుకు జాయన్ అయ్యారు .. అని బాలయ్య ప్రశ్నించగా.. ఈ ప్రశ్నలు అల్లు అరవింద్ మీతో అడిగించారని మోహన్ బాబు అనడం.. ప్రోమోలో హీట్ పెంచింది. మొత్తనికి ఎపిసోడ్ పై ఈ ప్రోమో ఆసక్తిని పెంచింది ‘ఆహా’ వేదికగా నవంబర్ 4 నుంచి ‘అన్‌స్టాపబుల్’ ప్రసారం కానుంది.