కేంద్ర హోంమంత్రి అమిత ్షా ఏపీ పర్యటనకు వస్తున్ారు. అయితే ఈ సారి దైవ దర్శనానికో బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడానికో కాదు.. తన శాఖ బాధ్యతల్లో భాగంగా తిరుపతిలో నిర్వహిస్తున్న అత్యున్నత సమావేశంలో పాల్గొనేందుకు స్తున్నారు. తిరుపతిలో ఈ నెల 14న తిరుపతి తాజ్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సౌత్ జోన్ కమిటీ సమావేశం జరగనుంది. హోంమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల సీఎంలు, ముఖ్య కార్యదర్శులు, అండమాన్ నికోబార్ లక్షదీవుల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది.
నిజానికి ఈ సమావేశాన్ని మార్చిలో నిర్వహించాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అప్పట్లో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో సమావేశం వాయిదా పడింది. ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో బిల్లు మాత్రం ఏపీ ప్రభుత్వం రూ. కోటి పన్నెండు లక్షలు చెల్లించాల్సి వచ్చింది. కేంద్రహోంమంత్రితో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడానికి రూ. నాలుగు కోట్ల ఖర్చు అంచనా వేశారు. ఇప్పుడు అంత కంటే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది.అయితే ఈ సారి సమావేశం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
అమిత్ షాతో ఇటీవల ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అదే రోజు జగన్ జిమ్ చేస్తూండగా కాలు బెణకడంతో ఆయన వెళ్లలేకపోయారు. ఈ సారి కూడా అలాంటి ఇబ్బందులేమీ లేకపోతే ఖచ్చితంగా సీఎం జగన్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. స్వయంగా హోంమంత్రినే రాష్ట్రానికి హాజరవుతున్నందున వ్యక్తిగతంగానూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
స్టాలిన్ తమిళనాడు సీఎం అయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, కేంద్రం పెత్తనంపై చురుకుగా స్పందిస్తున్నారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాడి – వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.