భాగమతి తర్వాత అనుష్క నుంచి కొత్త సినిమా కబురు రాలేదు. నిశబ్ధం సినిమా అంతకుముందు సెట్స్ పైకి తీసుకెళ్ళిన సినిమానే. ఈ సినిమా కూడా చాలా కాలం ఎడిటింగ్ రూమ్ లోనే వుండిపోయి కోవిడ్ కారణంగా అమోజాన్ ప్రైమ్ లో విడుదలై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎట్టకేలకు అనుష్క నుంచి సినిమా ప్రకటన వచ్చింది. భాగమతి నిర్మించిన యువీ బ్యానర్ లోనే కొత్త సినిమాకి సైన్ చేసింది అనుష్క.
ఈ రోజు అనుష్క పుట్టిన సందర్భంగా సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకి మహేష్ దర్శకుడు. సందీప్ కిషన్ తో రారా కృష్ణయ్యా సినిమాని తెరక్కించాడు మహేష్. ఈ సినిమా విజయవంతం కాలేదు. తర్వాత చాలా ప్రయత్నాలు చేసిన ఏ సినిమా ఫైనల్ కాలేదు. కోవిడ్ కి ముందే అనుష్క ని ఓ లేడీ ఓరియంటెడ్ లైన్ చెప్పాడు. ఎట్టకేలకు ఆ లైన్ ఓకే అయ్యింది. తర్వలోనే సెట్స్ పైకి వెళ్తారు. మొత్తానికి స్వీటీ బర్త్ డే గిఫ్ట్ గా అభిమానులకు ఓ స్వీట్ న్యూస్ అందించింది యువీ క్రియేషన్.