తెలంగాణ సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో ఓటమితో మరింతగా రగిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీని ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదనుకుంటున్న ఆయన ఘాటుగా హెచ్చరికలు జారీ చేస్తూండటమే కాదు ఈటల భూమల విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చేలా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.ఆయనను పార్టీ నుంచి బయటకు పంపడానికి ఉపయోగపడినా మెదక్ జిల్లాలోని జమునా హ్యాచరీస్ భూముల విషయంలో మరోసారి ఈటల కుటుంబానికి నోటీసులు జారీ అయ్యాయి. సర్వే చేస్తాం.. పద్దెనిమిదో తేదీన రావాలని ఈటల భార్య, కుమారుడికి ఆర్డీవో నోటీసులు జారీ చేశారు.
నిజానికి జూలై చివరి వారంలో ఈ భూములపై ఎస్సీ, ఎస్టీలు లేఖలు రాశారని విచారణ జరిపించి.. రెండు రోజుల్లోనే కలెక్టర్‌తో విచారణ జరిపించి.. నివేదిక తెప్పించి ఈటలపై వేటు వేయడం అన్నీ చేసేశారు. అయితే పదవుల సంగతేమో కానీ ముందు భూకబ్జా చేశామని నివేదిక ఇవ్వడంతో ఈటల కుటుంబం హైకోర్టుోల పిటిషన్ వేసింది. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయకపోవడంతో మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది.
అయితే అప్పట్లో ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఏ విచారణ చేపట్టలేదు. తర్వాత ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. ఉపఎన్నికలు రావడం ..మళ్లీ అందులో గెలవడం వరుసగా జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆ భూముల అంశం తెరపైకి వచ్చింది. ఈ సారైనా ఆయన భూముల్లో అక్రమాలు జరిగితే బయటకు తీస్తారో లేకపోతే.. కక్ష సాధింపులనిఅనుకుంటారని ఊరుకుంటారో వేచి చూడాలి !