బుల్లి తెరపై వినోదాలు పంచుతోంది… `జబర్ దస్త్`. అయితే అప్పుడప్పుడూ వివాదాలకూ కారణం అవుతోంది. జబర్ దస్త్ లో చాలామంది నటులు ఉన్నారు గానీ, ఒకరు మాత్రం కావాలని వివాదాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాడు. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్కుల్ని, టాక్ ఆఫ్ ది టౌన్ అనిపించుకున్న వ్యక్తుల చుట్టూ స్కిట్లు చేసి, నవ్విస్తుంటాడాయన. అవెంత పాపులర్ అవుతాయో.. అంతకంటే ఎక్కువ చిక్కుల్ని తీసుకొస్తుంటాయి. ఇటీవల ఓ నటుడి కామెంట్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి. వాటిని పట్టుకుని.. స్కిట్ చేశాడు ఈ కమిడియన్. దాంతో ఆ నటుడికి అత్యంత సన్నిహితమైన వ్యక్తులకు కోపం వచ్చింది.
వాళ్లేమో.. ఈ కమెడియన్ కి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనికోరారరని, అయితే అందుకు ఆ కమెడియన్ నిరాకరించడంతో.. కొంతమంది వ్యక్తులు సెట్ కి వెళ్లి మరీ…దాడి చేశారని, ఆ నటుడిపై చేయి చేసుకున్నారని, సెట్లో ఈ విషయమై చాలా గొడవ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచారని సమాచారం. మరి.. దీనిపై జబర్ దస్త్ కమిడియన్ స్పందిస్తాడా, లేదా? అనేది చూడాలి. సున్నితమైన విషయాలన్ని కామెడీ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న పనే. ఒకర్ని నవ్వించాలంటే, మరొకరి మనో భావాల్ని దెబ్బతీయడం కాదు. ఒకరిపై సెటైర్ వేస్తే.. ప్రతి ఒక్కరూ దాన్నిస్పోర్టీవ్ గా తీసుకోవాలన్న రూలు కూడా లేదు. తలతిక్క గ్యాంగ్ తగిలితే…. పరిస్థితులు ఇలానే దారుణంగా తయారవుతాయి అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఓ ఉదాహరణ.