మంచి నటుడిగా తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే మంచి సబ్జెక్ట్ అయ్యింటుందనే నమ్మకం. ఇప్పుడు ఆయన నుండి మరో సినిమా వస్తుంది. అదే అర్జున ఫల్గుణ. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి తేజ మర్నీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
”నాది కానీ కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు అర్జునుడిని” అని శ్రీవిష్ణు వాయిస్ తో మొదలైన ఈ టీజర్ ఆకట్టుకుంది. క్యాచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో పాత్రలన్నీ చూపిస్తూ యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి టీజర్ ని కట్ చేశారు. హీరోయిన్ అమృత అయ్యర్, సుబ్బరాజ్ , రంగస్థలం మహేష్, నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. ఒరిస్సా నేపధ్యం చూపించడం కూడా ఆసక్తికరంగా వుంది. మొత్తానికి అర్జున ఫల్గుణ టీజర్ సినిమా కథపై ఆసక్తిని పెంచింది.