అల్లు అర్జున్ కి లీగల్ నోటీసు వెళ్ళింది. ఈ నోటీస్ పంపింది ఆర్టీసీ ఎండీ సజ్జనార్. లీగల్ నోటీస్ కి కారణం.. ఆర్టీసీ ప్రతిష్టను కించపరచడం. ఇటివలే ర్యాపిడో సంస్థకు ఓ యాడ్ చేశారు బన్నీ. ఇందులో ఒక ఆర్టీసీ బస్ ని చూపిస్తూ.. వాటి సర్వీస్ వేస్ట్ .. రాపిడో సర్విస్ సూపర్ అన్నట్టుగా డైలాగులు, యాడ్ చిత్రీకరణ జరిగింది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, సంస్థ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.
డబ్బుల కోసం ఇలాంటి సంస్థలు దిగజారుతాయని, ఆర్టీసీ ప్రతి పల్లెకు వెళుతుందని, ప్రజల సౌకర్యం కోసమే ఆర్టీసీ తర్వాతే డబ్బు, ఒకరి సంస్థ ఎదగాలంటే, మరొకరిని తక్కువగా చూపించాల్సిన అవసరమేముంది.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఈ యాడ్ పై సజ్జనార్ స్పందిస్తూ.. ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి.ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది… అందుకే హీరోతో పాటు ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చాం” అని వెల్లడించారు సజ్జనార్.