తెలుగు రాష్ట్రాల్లో పెట్రో పన్నుల రాజకీయం జోరుగా సాగుతోంది. రెండు రాష్ట్రాలు పన్నులు పెంచింది కేంద్రమే కాబట్టి.. తాము తగ్గించే ప్రశ్నే లేదని కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నాయి. కానీ ప్రజల కోణం నుంచి ఆలోచించడం లేదు. ప్రజలకు ఎంత భారమైనా.. తాము మాత్రం ఆదాయం తగ్గించుకోవాలనుకోవడం లేదు. పెట్రో పన్నులపై ఏడాదికి కేంద్రం దేశవ్యాప్తంగా రూ. మూడున్నర లక్షల కోట్లను వసూలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇది నిజమే. అందులో సెస్ ల రూపంలో వసూలు చేసేది ఎక్కువ. సాధారణంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం పంచాల్సి ఉంటుంది. ఆ శాతం మేర పంచడం లేదని రాష్ట్రాల వాదన. అది కేంద్రం విధానం. ప్రజలకు సంబంధం లేదు. ఏ ఖాతాలో వసూలు చేసినా ప్రజలు కష్టాల్సిందే.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులే ఎక్కువ !
అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో సమానంగా పన్నులు వసూలు చేస్తున్నారు. వారు కూడా వ్యాట్ విధిస్తున్నారు.. అదనపు వ్యాట్.. సెస్ విధిస్తున్నారు. ఏ పేరుతో సెస్ వేస్తున్నారు.ో.. వాటికి పనులు చేయడం లేదు. అమరావతి, రోడ్ సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న దానికి ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ప్రస్తుతం కేంద్రం పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గించిన తర్వాత పన్నులు..కేంద్రం కన్నా రాష్ట్రం వసూలు చేసేదే ఎక్కువ. ప్రస్తుతం ఏపీలోఒక్క లీటర్ మీద .. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, అదునపు వ్యాట్, సెస్ అంతా కలిసి రూ. 35 వరకు పన్నులు వసూలు చేస్తోంది. కానీ కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు రూ.30 లోపే ఉన్నాయి. తెలంగాణలోనూ కేంద్రం వసూలు చేస్తున్నదాని కన్నా రాష్ట్రం వసూలు చేస్తున్నదే ఎక్కువ.
కేంద్రం పెంపుతో రాష్ట్రాల్లోనూ పెరిగింది నిజం కాదా !
పన్నుు పెంచింది కేంద్రం కాబట్టి కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగింది. పెట్రోల్ రేటు యావరేజ్ గా ఒక 100 రూపాయలు ఉంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ 31 శాతం అంటే 31 రూపాయలు టాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అదనపు వ్యాట్ నాలుగు శాతం, రోడ్ సెస్ రూపాయి కూడా ఉన్నాయి. అంటే 36 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లతుంది. ఇప్పుడు పెట్రోల్ రేటు రూ. 115 ఉంది కాబట్టి.. అది నలభై వరకూఉంటుంది. కానీ పెట్రోల్ రేటు 70 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడుర రాష్ట్ర ప్రభుత్వానికి లీటర్‌పై ఈ పన్నుల రూపంలో వచ్చేది కేవలం 25 లోపే. అంటే కేంద్రం రేట్లు పెంచి వంద దాటించడం వల్ల రాష్ట్రానికి కూడా లీటర్‌పై రూ. 15 చొప్పున పన్నుల ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాచేసి రాజకీయం చేస్తున్నాయి.
ప్రజల బాధల్ని పట్టించుకోవడమే రాజకీయం.. బ్లేమ్ గేమ్ కాదు !
ప్రజల బాధల్ని పట్టించుకుని .. వీలైనంతగా వారికి మేలు చేయడమే రాజకీయం. అంతే కానీ వారి కష్టాలకు మేము కారణం కాదు అని అడ్డగోలుగా వాదించి.. అలా వదిలేయడం రాజకీయం కాదు. చేతకాని తనం అవుతుంది. కళ్ల ముందు90 శాతానికిపైగా రాష్ట్రాలు పన్నులు తగ్గించిన అంశం కళ్ల ముందు కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ రేటు కనీసం పదకొండురూపాయలుఎక్కువ. ఇంత దారుణమైన దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం చేయడాన్ని ప్రజలు కూడా హర్షించరు.