పుష్షతో అందరి గెటప్పుల్నీ.. మార్చేసే యజ్ఞమేదో చేస్తున్నట్టున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ని నెవర్ బిఫోర్ అవతారంలో చూపించాడు. ఫహద్ ఫాజిల్ కి గుండు కొట్టించాడు. సునీల్ అయితే… గుర్తు పట్టలేనంతగా మార్చేశాడు. ఇప్పుడు అనసూయ వంతు వచ్చింది. పుష్షలో అనసూయ ఓ కీలకమైన పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. దాక్షాయని గా తను కనిపించనుంది. దాక్షాయని అనగానే రంగస్థలంలో.. రంగమ్మత్త కంటే సెక్సీగా ఉంటుందని అంతా భావించారు. అయితే మరోసారి సుక్కు షాక్ ఇచ్చాడు. బేబీక ట్, పెద్ద బొట్టు, మెడలో నగలు, పట్టు చీర, చేతిలో పట్టకర్ర, నోట్లో జర్దాతో… నయా అవతారంలో చూపించాడు. నిజంగా అనసూయని ఇలాంటి గెటప్ లో చూడడం షాకింగే. ఈ సినిమాలో అనసూయ మరో విలనా? అనే అనుమానం వచ్చేలా ఈ గెటప్ ఉంది. మొత్తానికి.. పుష్ఫలో ఏదో మ్యాజిక్ జగరబోతోందన్నది క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. ఇది వరకు చూపించని కథనే కాదు, చూడని గెటప్పుల్నీ చూడబోతున్నామని దాక్షాయని గెటప్ మరోసారి నిరూపించింది. డిసెంబరు 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.