ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ ‘నాటు నాటు’ పాట బయటికి వచ్చేసింది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ డ్యాన్స్ తో అదరగొట్టారు.రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం హైలట్.
‘పొలం గట్టు దుమ్ములోన పొట్ల గిత్త దూకినట్లు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు
మర్రి సెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు
నా పాట సూడు..
నాటు నాటు నాటు.. వీర నాటు .. నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చిమిరపలా పిచ్చనాటు
నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగ వెర్రినాటు”
పాటలోనే ఈ పల్లవి ఊర మాస్ క్యాచిగా వుంది. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే ఆలియా భట్, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ… 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్రానికి కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.