సుకుమార్ – దేవిశ్రీ కాంబినేషన్ అంటే.. అది మ్యూజిక్ గా హిట్టే. పైగా ఇద్దరి ఆల్బమ్ లో ఐటెమ్ సాంగ్ మస్ట్ అండ్ షుడ్. ఆర్య, ఆర్య 2, జగడం, రంగస్థలం చిత్రాల్లో ఐటెమ్ గీతాలు అదిరిపోయాయి. అవన్నీ ఓ ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు `పుష్ష`లోనూ అదిరిపోయే ఐటెమ్ గీతం ఒకటి సెట్ చేశాడు సుక్కు.`పుష్ష 1`లో ఒకటి, పుష్ష 2లో మరో ఐటెమ్ గీతాలుంటాయట. ప్రస్తుతానికి పుష్ష 1 కోసం ఐటెమ్ పాటని సిద్ధం చేస్తున్నారు. ఈనెల 26 నుంచి 29 వరకూ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఐటెమ్ గీతాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.దీనికి శేఖర్ మాస్టర్ నృత్య రీతుల్ని అందించబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఐటెమ్ గాళ్ ఎవరన్నది ఖరారు కాలేదు. ప్రస్తుతానికి తమన్నా, పూజా ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.రంగస్థలంలో పూజా ఐటెమ్ బాగా పేలింది. పైగా బన్నీకి కలిసొచ్చిన హీరోయిన్ పూజా. అందుకే పూజా మరోసారి ఐటెమ్ గాళ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూజా ఉంటే.. రంగస్థలంని ఫాలో అయినట్టు అనిపిస్తుందేమో అన్నది సుకుమార్ భయం. అందుకే మరో ఆప్షన్ గా తమన్నాని పక్కన పెట్టారు. వీరిద్దరిలో ఒకరు బన్నీతో ఐటెమ్ నెంబర్ చేయడం ఖాయం. కాకపోతే…. ఫైనల్ గా ఎవర్ని ఖాయం చేస్తారో చూడాలి.