రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకుని తాకట్టు పెట్టేయాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల పోరాటం ఆటంకంగా ఆటంకంగా మారింది. అయితే దీనికి కూడా ప్రభుత్వం తమకు అలవాటైన డొంక తిరుగుడు పద్దతినే పరిష్కారంగా ఎంచుకుంది. ఆప్షన్ల పేరుతో జీవోకు సవరణలు విడుదల చేసింది.కానీ ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన తెర వెనుక వ్యవహారాలతో ఎవరూ నమ్మడం లేదు. ఇది ఖచ్చితంగా ఎయిడెడ్ విద్యా సంస్థలను బెదిరించి అయినా సరే లాక్కోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్లేనని ఓ అంచనాకు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం మార్చుకోవాలి కానీ ఇలా ఆప్షన్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఏపిలో ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఎయిడెడ్ జూనియర్ కాలేజిలు 122 , ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు 137 ఉన్నాయి. లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆస్తులతో సహా ఏపి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. లేకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి స్వాధీనం చేయని ఎయిడెడ్ విద్యాసంస్దలలకు ప్రభుత్వం ఎయిడ్ ఆపేస్తుంది. అంటే అది ప్రైవేటు విద్యా సంస్థ అయిపోతుందన్నమాట. ఈ కారణంగా చాలా విద్యా సంస్థలు ఫీజులు పెంచడం లేదా స్కూళ్లను మూసివేయడం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అధికారుల్ని ప్రయోగించి బలవంతంగా స్కూళ్లను స్వాధీనం చేసుకుంటోంది. దీంతో అనేక సందేహాలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో అందరికీ అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు చేస్తే ఏ వివాదమూ ఉండేది కాదు. కానీ ప్రభుత్వం అలాంటిదేమీ చేయకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా విద్యా సంస్థలు ఫీజుల భారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని విద్యా సంస్థలు మొత్తానికే మూసివేత నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఇప్పుడు ఈ సవరణలు.. ఆప్షన్లు కాదని.. మొత్తం జీవోలనే ఉపసంహరించుకోవాలని.. యుధావిధిగా ఎయిడెడ్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతే అంతే మరి.. ఏం చెప్పినా రివర్స్‌లో చేస్తే ప్రజలు నమ్మడం అసాధ్యం. !