కుప్పం మున్సిపాలిటీలో ఓడించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారన్న సంకేతాలు పంపాలని మంత్రి పెద్దిరెడ్డి ఖర్చుకు వెనుకాడకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వైసీపీ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ కంటే ఎక్కువే లభిస్తూండగా.. టీడీపీ నేతలకు మాత్రం కానిస్టేబుళ్లు కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏ మాత్రం తగ్గకుడా టీడీపీ నేతలు కూడా ప్రతిఘటిస్తున్నారు.
తిరుపతి, బద్వేలు ఎన్నికల్లో దొంగ ఓటర్ల హవా ఉన్నట్లుగానే కుప్పానికి పెద్ద ఎత్తున స్థానికేతరులను తరలించారు. వారు ఉన్న ఇళ్లు, కల్యాణమండపాలను టీడీపీ నేతలను చుట్టుమడితే పోలీసులే వారినే తరిమికొట్టారు. అంటే కుప్పంలో అమ్మానాన్న తెలియని వాళ్లు.. పుట్టిన ప్రాంతమేదో తెలియని వాళ్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రలోభాలకు పోటీగా తామూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరికి చంద్రబాబునాయుడు కూడా పోలింగ్ సరళి పరిశీలించేందుకు కుప్పం వెళ్లనున్నారు. అక్కడ అలాంటి స్థాయి నేత లేకపోతే పోలింగ్ సిబ్బందితోనే అరాచకాలు చేస్తారన్న అభిప్రాయంతో చంద్రాబు కుప్పం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇతర చోట్ల కూడా ఎన్నికల్లో టీడీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.