‘ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో వుంటావ్. కానీ గెలిస్తేనే చరిత్రలో వుంటావ్’ ఇదీ వరుణ్ తేజ్ గని టీజర్ పంచ్ లైన్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ‘గని’. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ ని రిలీజ్ చేశారు. ”ప్రతి ఒక్కడికి ఛాంపియన్ అయిపోవాలనే ఆశ వుంటుంది. కానీ విజేత నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నీవే ఎందుకు అవ్వాలి” అనే డైలాగ్ ఈ సినిమా థీమ్ ని తెలియజేస్తుంది. ఈ డైలాగ్ పూర్తయిన వెంటనే హెవీ ఆర్ఆర్ తో సినిమాలో పాత్రలు, సీన్లు చూపిస్తూ షాట్లు పడ్డాయి.
సినిమాలో డైలాగులు ఏమీ వినిపించకుండా టీజర్ వరకు చరణ్ వాయిస్ తోనే గని పాయింట్ ని చెప్పే ప్రయత్నం చేశారు. టీజర్ చూస్తే గని లో ఫుల్ యాక్షన్ కనిపిస్తుంది. వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. టీజర్ లో బాక్సింగ్ రింగ్ చూస్తే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తమ్ముడు సినిమా గుర్తుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తమ్మడు ఓ సూపర్ హిట్. యూత్ లో పవన్ కళ్యాణ్ కక్రేజ్ ని పెంచిన సినిమాల్లో తమ్ముడు కూడా వుంది. ఇప్పుడు వరుణ్ బాక్సింగ్ నేపధ్యంతో వస్తున్నాడు. డిసెంబర్ 24న సినిమా విడుదల కానుంది.