ఇటీవల వచ్చిన నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మొదటి సినిమానే హిట్ కొట్టిన ముద్దుగుమ్మ మెహెరిన్ పిర్జాదా కౌర్ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. ఇప్పటికే పూరి, కళ్యాన్ రామ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ చెంత మరో లక్కీ ఛాన్స్ కూడా చేరిందట. కృష్ణగాడిలో మహాలక్ష్మిగా తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ చిన్నది తమ సినిమాలో హీరోయిన్ గా చేసుకునేందుకు దర్శక నిర్మాతలు వెంటబడుతున్నారు.
ఆ దారిలోనే మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటించబోయే తర్వాత సినిమాలో మెహెరిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. రచయిత బివిఎస్ రవి మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ దాదాపు కన్ఫాం అయ్యిందట. ప్రస్తుతం సుప్రీం సినిమా షూట్ లో బిజీగా ఉన్న సాయి అది పూర్తి చేయగానే దీన్ని పట్టాలెక్కించనున్నాడట. మరి వరుస అవకాశాలను పట్టేస్తున్న ఈ మోడ్రన్ మహాలక్ష్మి అదే రేంజ్ సక్సెస్ లను అందుకోవాలని ఆశిద్దాం.