ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇజ్జత్ అంతాపార్టీ నేతల ముందు పోయింది. ఇప్పటి వరకూ తాను తీసుకున్న నిర్ణయాలన్నింటినీ అమిత్ షా .. ఘాటు పదజాలంతో ప్రశ్నించడంతో ఇక ఆయన మాటలనులెక్క చేయకూడదని అందరూ డిసైడయిపోయినట్లుగా ఉన్నారు. ఏబీఎన్ చానల్‌ను నిషేధించినట్లుగా వీర్రాజు ప్రకటించారు. ఇప్పుడు ఆ చానల్లో విరివిగా బీజేపీ నేతలు కనిపిస్తున్నారు. గతంలో ఆయన సస్పెండ్ చేసిన లంకా దినకర్ అనే నేత వెంటనే ప్రత్యక్షమయ్యారు. ఇక అమరావతి విషయంలో సోము వీర్రాజు గతంలో చేసిన ప్రకటనలకు భిన్నంగా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తోంది.
అమిత్ షా భేటీ తర్వాతి రోజు మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు రైతుల పాదయాత్రలో పాల్గొంటామని ప్రకటించారు. నిజానికి అమరావతి గురించి మాట్లాడినందుకే గతంలో కొంత మందిని సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. అమరావతికి మద్దతు విషయంలో చాలా స్పష్టంగా ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఆ విషయం షాతో భేటీ ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతోనే తేలిపోయింది. ఇప్పటి వరకూ అమరావతి ఉద్యమం విషయంలో అటూఇటూ కాకుండా వస్తున్న ఏపీ బీజేపీలోని ఓ వర్గం ఇప్పుడు పాదయాత్రలో పాల్గొంటామని చెబుతోంది. అయితే ఈ ప్రకటన అన్యమనస్కంగానే ఉంది. సీరియస్‌గా వారు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తామని చెప్పడం లేదు.
అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీలోని వైసీపీ ఫ్యాన్స్ పరపతికి పూర్తి స్థాయిలో గండి పడినట్లుగా స్పష్టమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత మాత్రాన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదని.. అందర్నీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అమిత్ షా గట్టిగా తేల్చి చెప్పేశారు. పైగా పార్టీలో చేరిన వారిని దూరం పెట్టడం వంటివి చేయడం సాధ్యం కాకపోవచ్చంటున్నారు. అంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము ఉన్నా.. ఇక పార్టీని నడిపేతే యాంటీ వైసీపీ నేతలేనన్న అభిప్రాయం ఆ పార్టీలో బలపడుతోంది.