పెట్టుబడి – లాభం మధ్య ఆడే ఆటే వ్యాపారం. ఈ సూత్రాలు మన యువ హీరోలు బాగానే బట్టీపట్టేశారు. తాము పెద్ద సినిమాల్లో నటిస్తూ, మరో వైపు చిన్న సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరిస్తూ, తమ బ్రాండ్ ఈమేజ్ తో ఆ సినిమా బిజినెస్ చేసుకుని, లాభాలు పొందుతున్నారు. విజయ్ దేవరకొండ కూడా అదే చేశాడు. తన తమ్ముడితో `పుష్పక విమానం` తీశాడు. ఈసినిమాకి విజయ్ నే నిర్మాత. తమ్ముడ్ని హీరోగా ప్రమోట్ చేసుకుంటూనే, నిర్మాతగా తానూ మంచి లాభాలూ పొందాడు. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బయటి నుంచి కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి.కాకపోతే.. ఈ సినిమాని స్వయంగా విజయ్ దేవరకొండనే హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. దానికీకారణం ఉంది.
ఈ సినిమా కోసం పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. కాస్త ఫేమ్ ఉన్న నటీనటుల్ని తీసుకుంటే, తక్కువలోనే ఈ సినిమాని పూర్తి చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్టులు బాలీవుడ్ లో బాగానే ఆడతాయి. ఓటీటీకి ఇచ్చుకున్నా, లాభాలకు కొదవ ఉండదు. ఇలాంటి మంచి ఛాన్స్ ని విజయ్ ఎందుకు వదులుకుంటాడు? అందుకే బాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో… విజయ్ స్వంతంగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ రకంగా.. ఈ సినిమాతో విజయ్ నిర్మాతగానూ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడన్నమాట.