చిరంజీవి సూచన తో ముందుకొచ్చిన యోధా లైఫ్ లైన్ హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో యోధా లైఫ్ లైన్ డయాగ్నొస్టిక్ కేంద్రం ఏర్పాటు అయింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే చిరంజీవి యోధా లైఫ్ లైన్ సారధి సుధాకర్ కంచర్ల కు ఒక సూచన చేశారు. సినీ కళాకారుల్లో పేద వారున్నారు. అలాంటి వారు కూడా డయాగ్నొస్టిక్ సేవలు ఈ కేంద్రంలో పొదడానికి వీలుగా రాయుతీ కల్పించే విషయం ఆలోచించాలని అన్నారు. దీనికి సుధాకర్ కంచర్ల వెంటనే స్పందించారు. సినీ పరిశ్రమ తో ముదిపడిన వారికి తమ యోధా లైఫ్ లైన్ లో 50 శాతం రాయితీతో సేవలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఆయన 25 లక్షల రూపాయల చెక్ ను ఉప రాష్ట్రపతి ద్వారా అందించారు.