వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నీసా గుండెపోటుతో చనిపోయారు. మండలి సమావేశాలకు హాజరైన ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరీమున్నీసా విజయవాడ వైసీపీ నాయకురాలు. కార్పొరేటర్ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన సమయంలో ఆమెకు ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ అయ్యారు. విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఆమె పనిచేశారు.
ఇటీవలే ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దరఖాస్తు చేసుకోకపోయినా సీఎం జగన్ పిలిచి అవకాశం ఇచ్చారని కరీమున్నీసా.. ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీ అధికార ఒత్తిడే ఆమె ఆరోగ్యానికి చేటు తెచ్చినట్లుగా ఉంది. ఎమ్మెల్సీగా పదవి చేపట్టి మండలి సమావేశాలకు హాజరైన రెండో రోజే ఆమె గుండెపోటుకు గురయ్యారు.
కరీమున్నీసా మృతిపై ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగారన్నారు.