ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవల ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉందని సమాచారం అందుతోంది. 1935 జులై 25న కౌతవరంలో జన్మించిన కైకాల.. 1959తో సిపాయి కూతురు అనే సినిమాతో చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు. దాదాపు 777 చిత్రాల్లో నటించారు. నవరస నటనా సార్వభౌమ గా కైకాలని అభిమానులు, చిత్రసీమ పిలుచుకుంటుంది.