ఓ వ్యక్తి ఏడుస్తూంటే సంతోషించే వారిని ఏమంటారు ?. ఉన్మాదులనే అంటారు. ఈ ఉన్మాదులను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఓ వర్గం పెంచేస్తోందని.. కనీస మానవ విలువలు, కుటుంబ విలువలు కూడా తెలియకుండా చేసి రాజకీయంగా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చేసిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే విశ్లేషించారు. ప్రతీ వారాంతంలో ఆయన రాసే కొత్తపలుకుకు గత వారం విరామం ఇచ్చారు. ఈ సారి కూడా ఆయన రాయకపోయేవారేమో కానీ.. ఏపీ అసెంబ్లీ ఘటన తర్వాత మనసు మార్చుకుని అప్పటికప్పుడు రాసేశారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరికి .. పవిత్రమైన అసెంబ్లీలో జరిగిన అవమానం ఆయనను బాధ పెట్టినట్లుగానే రాశారు.
అయితే చంద్రబాబు ఏడుస్తూంటే సంతోషపడిన వాళ్లు ఇంకా చెప్పాలంటే ఆయనకు అలా జరగాల్సిందే అని అనే వాళ్ల పట్ల ఆర్కే జాలి చూపారు. ఏపీలో పడిపోతున్న కుటుంబ బంధాలకు ఇది సాక్ష్యమని ఆయన చెబుతున్నారు. చంద్రబాబుపై వ్యాఖ్యలను సమర్థించేవారు తమ కుటుంబ సభ్యులపైనా అదే అభిప్రాయంతో ఉంటారని ఆయన చెబుతున్నారు. ఇలాంటి సైకోల్ని పెంచి రాజకీయంగా లబ్ది పొందుతున్న వారి వల్ల ఏపీ సమాజం నైతికంగా కూడా దిగజారిపోయిందని తన ఆర్టికల్‌లో అంతర్గతంగా ఆర్కే విశ్లేషించారు.
చంద్రబాబు మహా అయితే ఓ ఎన్నికల్లో మాత్రమే పాల్గొనగలరని.. తర్వాత ఆయన వయసు సహకరిస్తుందో లేదో తెలియదని ఇంతోటి దానికి ఆయనపై మానసిక దాడులు చేయడం ఏమిటని ఆర్కే ఆశ్చర్యపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డిది అత్యంత ప్రమాదకరమైన మైండ్ సెట్ అని.. దానికి ప్రజలు కూడా బలవ్వాల్సింేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆయన కుటుంబంలో ఆయనే చిచ్చు పెట్టుకుని తన రాజకీయాల కోసం తల్లీ, చెల్లిని దూరం చేసుకుని.. దానికీ చంద్రబాబునే నిందించడం అంటే ఎంత దారుణమైన మైండ్‌తో జగన్ ఉన్నాడో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించడం.. ఓ ముఖ్యమంత్రిగా ఎంపీకి సంబంధంలేదని ప్రకటించడం దర్యాప్తును ఖచ్చితంగా ప్రభావితం చేసేదని తెలిసే జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు. దేశంలోనే అత్యంత దారుణమైన మానసిక స్థితి ఉన్న జగన్ ద్వారా ఏపీలో మరిన్ని దారుణాలు చూడబోతున్నామని ఆయన చెప్పకనే చెబుతున్నారు.