రాజధాని బిల్లులు ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో ఎవరికీ తెలియడం లేదు. వైసీపీ నేతలు, ఫ్యాన్స్‌కు కూడా అర్థం కావడం లేదు. అయితే జగన్ తీరు గురించి తెలిసిన వారు మాత్రం అలాంటి విధ్వంసకర నిర్ణయాల విషయంలో అసలు వెనక్కి తగ్గరని గట్టిగా నమ్ముతున్నారు. మరెందుకు వెనక్కి తగ్గారో స్పష్టత లేదు. కానీ ఒక్కో విషయం బయటకు వస్తోంది. రాజధాని కోసం రూ. యాభై వేల కోట్ల రుణం కావాలని ప్రపంచ బ్యాంక్‌కు ఏపీ ప్రభుత్వం ధరఖాస్తు పెట్టిందట.దానికి కేంద్రం కూడా మద్దతు తెలిపిందట. కేంద్రం ద్వారానే ఆ రుణ ప్రతిపాదన ప్రపంచబ్యాంక్‌కు వెళ్లింది.
అయితే ఇప్పుడు రూ. యాభై వేల కోట్ల అప్పు కావాలంటే ఏ రాజధానో స్పష్టంగా చెప్పాలి. ఆ యాభై వేల కోట్లు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ మీద పెడతాం అని చెప్పాలంటే చట్టపరమైన చిక్కులు ఉన్నాయి. ఇంకా క్లారిటీ లేదు. పైగా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఏ రాజధానో చెప్పాల్సిన అవసరం పడింది. దీంతో అసలు మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ ఉపసంహరించుకున్నారు. అంటే ఇప్పుడు డౌట్ లేదు. సీఆర్డీఏ కూడా ఉంది. అంటే రాజధాని అమరావతి అన్నమాట. ఇప్పుడు రాజధాని కట్టడానికే రూ. యాభై వేల కోట్ల రుణం వస్తుందన్నమాట. అయితే ఇక్కడ అసలు తిరకాసు ఉంది. రాజధాని కట్టేందుకు రూ. యాభై వేల కోట్ల రుణం వస్తుందేమో కానీ.. అది అమరావతి కి కాదు. ఎందుకంటే అమరావతి రాజధాని అని ప్రభుత్వం రుణం తీసుకునేటప్పుడు చెప్పదు. రాజధాని కోసమనే చెబుతుంది.
ఈ లోన్ కోసమే మూడు రాజధానులు లేవని.. ఏపీకి రాజధాని ఉందని చెప్పేందుకే ఈ వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. వన్స్ ఓ సారి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మళ్లీ బిల్లు పెట్టి మూడు రాజధానులు అని చెప్పి.. ఆ యాభై వేల కోట్లను.,.. అటూ ఇటూ తరలించుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో మునిగిపోయి.., వడ్డీలు, జీతాలకు ఆదాయం సరిపోని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం అప్పులు ఎక్కడ దొరికినా.. ఎలా చెల్లించాలన్నదానితో నిమిత్తం లేకుండా అప్పులు చేస్తోంది. అందులో భాగంగానే వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు పెట్టమంటే పెడుతున్నారు… రాజధాని బిల్లులు ఉపసంహరించమంటే ఉపసంహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిపాలన చేస్తున్నట్లుగా లేదు. అప్పుల కోసం పాలన చేస్తున్నట్లుగా ఉంది.