రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. ముఖ్యమంత్రే లైట్ తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద బాధితుల్ని కొంత మంది స్వచ్చంద సంస్థలు ఆదుకున్నాయి. ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతలు మరో ప్రచారం మొదలు పెట్టారు . వరదలతో అతలాకుతలం అయిపోతే విరాళాలు ఇవ్వొద్దా అని టాలీవుడ్ హీరోలను ప్రశ్నిస్తున్నారు. బుద్ది ఉండక్కరా అంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రెచ్చిపోయారు. కర్నూలులో మరికొంతమంది నేతలు వైసీపీ నేతల పేరుతో కాకుండా ఓ సంఘం పేరుతో విమర్శలు చేశారు. హీరోలంటే వీరికి టేకిట్ గ్రాటెండ్గా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్‌ను పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ధియేటర్లు సహా అన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది. టిక్కెట్లు అమ్ముతామంటూ బయలుదేరింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఏపీలో ధియేటర్లు మూసుకోవడం లేదా.. అసలు రిలీజులు ఆపేసుకోవడం మంచిదన్న ఉద్దేశంలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు విడుదల కాక నిర్మాతలు ఇబ్బందులో ఉన్నారు. దీనంతటికి కారణం ఏపీసర్కారే. అయినప్పటికీ వరదలు వచ్చాయని హీరోలు విరాళాలివ్వలేదని మూలగడం ప్రారంభించారు.
నిజానికి రాయలసీమలో జరిగిన విధ్వంసం చిన్నది కాదు. పెను విపత్తు.కానీ ఆ విపత్తు విషయంలోప్రభుత్వం ఎలా వ్యవహరించిందన్నదానిపైనే సీరియస్ నెస్ ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. దీంతో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. విరాళాలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారికి సంకేతాలు వెళ్తే .. వారు వచ్చి కాస్త విరాళాలు ఇచ్చి వెళ్తారేమో..? కానీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారు విరాళాలిమ్మంటే ఏమిస్తారు ?
హీరోలకు బుద్ది ఉండక్కర్లా అంటున్న నల్లపురెడ్డికి బుద్ది ఉందోలేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వరద బాదితుల్ని పిచ్చి మందు వేసుకుని రచ్చ చేస్తార్రా అంటూ బెదిరించినవ్యక్తి….చంద్రబాబు మీద,మీడియా మీద అధికారం ఉంది మిమ్మల్ని ఏమైనా చేస్తామని బెదిరించే నోటి దురుసు ఉన్న నేత. ఆయన గురించి వైసీపీ పెద్దలే ఆలోచించాలేమో..?