ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాపై కాస్త ప్రేమ ఎక్కువే. ఈ వరదలతో అతలాకుతుతలం అయిపోయినా ఆయన కనీసం సొంత జిల్లాలో అడుగు పెట్టలేదని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు అసెంబ్లీలో స్వయంగా చెప్పుకున్నారు. ఆ వరదలు ఇవాళ వస్తాయి.. రేపు పోతాయి. కానీ శాశ్వతంగా ఉండేది జీవోలు మాత్రమే. అందుకే కడప జిల్లాపై తనకు ఉన్న ప్రేమ ఎక్కువేనని నిరూపిస్తున్నారు. సీఆర్డీఏ కంటే అిత పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కడప జిల్లాలో ప్రకటించాు.
12వేల కిలోమీటర్ల పరిధిని కవర్ చేసే అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ దేశంలో ఎక్కడా లేదు. చివరికి హైదరాబాద్, బెంగళూరు కోల్ కతా, ముంబై, చెన్నైలకూ లేదు. కానీ వాటన్నింటికంటే పెద్ద అర్బన్ డెలవప్మెంట్ అధారిటీని సీఎం జగన్ కడప డిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంంట్ అధారిటీ పేరుతో దీన్ని ఖరారు చేశారు. అయితే ఇదేమి కొత్తగా కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్నమయ్య అర్బన్ డెలవప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేసి కడప జిల్లాలను సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రకారం జనవరి 1, 2019న జీవో నెంబర్ 2ని విడుదల చేశారు. అన్నమయ్య యూడీఏ కింద 5392 కిలోమీటర్లను కవర్ చేస్తూ అధారిటీని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన జీవోను జగన్మోహన్ రెడ్డి సవరించి మరింత పరిధి పెంచారు. ఈ కారణంగా సీఆర్డీఏను మించి పోయింది. నిజానికి సీఆర్డీఏను జగన్ రద్దు చేశారు. మళ్లీ రద్దు వెనక్కి తీసుకున్నారు. సీఆర్డీఏను రద్దు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కారణంగా సీఆర్డీఏ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అందుకే ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ అయిన కడపలో కేంద్రీకృతమయ్యే అన్నమయ్యే యూడీఏనే కీలకం.
అయితే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఈ అన్నమయ్య అర్బన్ డెవలవ్‌మెంట్ అధారిటీని ఖరారు చేశారు. చంద్రబాబు అన్ని నిర్ణయాలను రద్దు చేసిన జగన్ .. దీన్ని మాత్రం రద్దు చేయలేదు. కానీ రెండున్నరేళ్లు సైలెంట్‌గా ఉంచి.. ఇప్పుడు దాని పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లాపై తన ప్రేమను చాటుకున్నారు. అయితే ఇలా జీవొలిచ్చేస్తే సరిపోతు కదా.. దానికి తగ్గట్లుగా ఏదైనా పనులు.. అభివృద్ధి చేయాలి. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తారో మరి !