తాడేపల్లిలోని వైఎస్ జగన్ ఇల్లు.. ప్రస్తుతం సీఎం క్యాంపాఫీస్‌గా పరిగణిస్తున్న ఇంటికి వచ్చే ముఖ్యుల కోసం కొంత కాలంగా కొంత స్థలాన్ని పార్కింగ్‌కు వాడుతున్నారు. ఇటీవల ఆ పార్కింగ్ స్థలానికి తెరలు కట్టేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. నిన్ననే ఆ తెరలు తీసేసిన వారికి అక్కడ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అచ్చంగా పర్ణశాల తరహా సెట్టింగ్ అక్కడ కనిపించింది . ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేలా చిన్న చిన్న చెలమలు.. కాలువ లాగా ఓ ఏర్పాటు.., దానిపై చిన్న చెక్క వంతెన.. అలాగే ఆ పర్ణశాలలో గోవులను పెంచుకునే ఏర్పాటు.. ఇలా అచ్చంగా సినిమాల్లో కనిపించే సెట్టింగ్.. పెయింటింగ్‌లలో కనిపించే ఆహ్లాదం…అక్కడ సాక్షాత్కరించింది.
ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గరుండి దాన్ని రూపొందింపచేశారని చెబుతున్నారు. సీఎం జగన్ సతీమణి భారతికి అలాంటి ఏర్పాటు కావాలని అనిపించింది. అక్కడ ఆరు ఆవులు కూడా పెంచాలని అనుకున్నారు. అందుకే వీలైనంత మేలు రకం ఆవుల్ని కూడా చెవిరెడ్డినే తీసుకు వచ్చారు. ఆ అవుల్ని పర్ణశాలకు తరలించారు. ఉదయం జగన్ సతీమణి భారతి.. తర్వాత జగన్ కూడా ఆ పర్ణశాలను సందర్శించారు. అంత వరకూ బాగానే ఉంది.
మామూలుగా అయితే ఈ విషయం బయటకు రాకూడదు. కానీ గోశాల పెట్టారని గోవులకు పూజలు చేస్తున్నారన్న ప్రచారం కోసం.. వివరాలను బయటకు లీక్ చేశారు. దీంతో అందరికీ తెలిసిపోయింది. మొత్తంగా చూస్తే అంతపురానికి ఓ పర్ణశాల కూడా రెడీ అయిందన్న సెటైర్లు మాత్రం సోషల్ మీడియాలో పడుతున్నాయి.