ప్రముఖ గీత రచయిత సీతారామశాస్త్రి ఆరోగ్యం అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నట్టు సమాచారం. ఈరోజు ఆయనకు ఓ కీలకమైన ఆపరేషన్ జరగాల్సివుంది. అయితే… ఆ ఆపరేషన్ ని ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయడం కష్టమని భావించిన వైద్యులు ఆపరేషన్ వాయిదా వేసినట్టు సమాచారం. ఊపిరితిత్తుల సమస్య, శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్నారు సీతారామశాస్త్రి. ఆయనకు అతస్యవసరమైన, ఆధునికమైన వైద్యం అందించినా ప్రయోజనం లేకుండా పోతోందని తెలుస్తోంది. సీతారామశాస్త్రి ని పరామర్శించడానికి ప్రముఖులు ఆసుపత్రికి వెళ్దామన్నా, కుటుంబ సభ్యులు, వైద్యులు వారిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ క్షణంలో ఎలాంటి దుర్వార్త వినాల్సివస్తుందో అని ఆయన అభిమానులు తల్లడిల్లుతున్నారు. ఆయన క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు.