దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ విడిచారు. సిరివెన్నెల మరణ వార్త యావత్ సినీ ప్రపంచాన్ని కలచి వేసింది. నిన్న సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారని, ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. ఇంతలోనే సిరివెన్నెల ఇక లేరనే వార్త అందరినీ దిగ్బ్రాంతిని గురి చేసింది.
సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే సమస్య ప్రాణంతంకంగా వుందనే విషయాన్ని ఎవరూ ఉహించలేదు. ఇటివలే విడుదలైన క్రిష్ ‘కొండపొలం’ సినిమా కోసం రెండు పాటల్ని రాశారు సిరివెన్నల. ఏదో చిన్న అనారోగ్యం మళ్ళీ తిరిగి వచ్చేస్తారనే అందరూ సన్నిహితులు, అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇంతలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావడం అందరినీ కలిచివేసింది. సిరివెన్నెల లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. సిరివెన్నెల మరణం.. ఆయన పాటని ప్రేమించిన అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచింది.