అల్లు అర్జున్.. సుకుమార్ ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఇలా భారీ తారాగణం వుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప- ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం ఆరు గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహుర్తహం పెట్టారు.
అయితే ఇప్పుడా ట్రైలర్ రాకకు అంతరాయం ఏర్పడింది. కొన్ని టెక్నికల్ కారణాల వలన ట్రైలర్ బయటికి రాలేదు. దీంతో ట్విట్టర్ వేదికగా నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. కాస్త వేచి చూడాలని కోరారు. భారీ అంచనాల మధ్య ‘పుష్ప- ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే, ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమౌతుంది. దాదాపు మెగాహీరోలు ఈ ఈవెంట్ కి హాజరయ్య అవకాశం వుంది.
#PushpaTrailer pic.twitter.com/xzhyn8XMpt
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2021