ఈరోజు 6 గంటలకు రిలీజ్ అవ్వాల్సింది.. పుష్ప ట్రైలర్.కానీ మూడున్నర గంటలు ఆస్యమైంది. అయితేనేం.. ఆ ఫైరు.. తగ్గలే. ఎదురుచూసీ ఎదురు చూసీ విసిగిపోయిన అభిమానులకు పుష్స నుంచి… అదిరిపోయే గిఫ్టు వచ్చేసింది ట్రైలర్ రూపంలో.
2 నిమిషాల 30 సెకన్ల టీజర్ ఇది. 150 సెకన్లలోనే సుకుమార్ సినిమా చూపించేశాడు.
భూమండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతాంది.
భూమిపై పెరిగే బంగారం.. పేరు ఎర్రచందనం – అనే అజయ్ ఘోష్ డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి మాస్ ఎలివేషన్లు, ఛేజింగులు మొదలైపోయాయి. జైల్లో.. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటున్న అల్లు అర్జున్ ని రివీల్ చేస్తే… `ఏడ దాచిపెట్టావురా సరుకు` అంటూ పోలీసు గద్దిస్తే `చెబితే మా బాస్ చంపేస్తాడు..` అంటూ పుష్ప రాజ్ తెరపైకొచ్చాడు. అక్కడ… పుష్ప నవ్వే నవ్వులోనే.. హీరోయిజం ఎలివేట్ అయిపోయింది.
ఆ వెంటనే… రొమాన్స్ పార్ట్ మొదలైంది. కోకని గాలికొదిలేస్తూ.. రష్మిక ఎంట్రీ ఇచ్చింది. `ఏం పాప.. నచ్చినానా నీకు` అంటూ… బన్నీ బీటు కొట్టడం, ఆ వెంటనే.. `నేను నిన్ను సూడలేదని పులుపెక్కిపోతాండవట` అంటూ రష్మిక సెటైర్లు మొదలయ్యాయి.
`ఈ లోనం నీకు తుపాకీ ఇచ్చింది. నాకు గొడ్డలిచ్చింది. ఎవడి యుద్ధం వాడిదే`
`పుష్ష అంటే పువ్వనుకుంటున్నారేంట్రా.. ఫైరు..`
– ఇలా డైలాగులు, మాస్ ఎలివేషన్లతో… ట్రైలర్ హోరెత్తిపోయింది. సునీల్, రావు రమేష్, అనసూయ.. ఇలా ప్రతీ ప్రధాన మైన పాత్రనీ ట్రైలర్లోనే పరిచయం చేసేశాడు సుకుమార్. ప్రధాన విలన్ .. ఫహద్ ఫాజిల్ ఎక్కడా అనుకుంటున్నప్పుడు చివర్లో
`ఏం పుష్పా.. పార్టీ లేదా` అనే డైలాగ్ తో తనూ ఎంట్రీ ఇచ్చేశాడు. చివర్లో మాస్ పార్టీ బిగెన్స్ అంటూ డిసెంబరు 17న విడుదల తేదీ ప్రకటించారు. మొత్తానికి ట్రైలర్ ఫుల్ ప్యాక్డ్గా ఉంటూ.. అంచనాల్ని అమాంతం పెంచేసింది. బన్నీ లుక్, తన బాడీ లాంగ్వేజ్, సినిమా టోన్.. ఇవన్నీ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాయి. సుకుమార్ చెప్పినట్టు.. మాస్ పార్టీకి రెడీ అయిపోవాల్సిందే.