సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ఈడీ కేసులు తేలిపోయాయి. ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఈడీ ఎందుకు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించిందనేది ఇప్పుడు ఆసక్తికరకంగా మారింది. ఎప్పుడో 2017లో తెలంగాణ పోలీసులు నమోదు చేసి.. సినీ తారలను ప్రశ్నించిన కేసును తీసుకున్న ఈడీ తాము కూడా నాలుగేళ్ల తర్వాత రంగంలోకి దిగింది. హఠాత్తుగా అందర్నీ ప్రశ్నించింది.
ఈడీ విచారణ జరుపుతున్న సమయంలోనే తెలంగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2017లో వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ వారి శాంపిళ్లను కూడా తీసుకుంది. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపింది. అదేసమయంలో కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు.. డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టం సాధ్యంగా మారింది. ఎందుకంటే అసలు ఈడీ నమోదు చేసిన కేసే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఆధారంగా చేసింది.
సినీ తారలను ప్రశ్నించినప్పుడు ఎలాంటి ఆధారాలులభించలేదని..ఈడీ వర్గాలు మీడియాకు తెలిపాయి. సినిమాతారల విచారణ కూడా మీడియా సాక్షిగా జరిగినట్లుగా పాయింట్ టు పాయింట్ బయటకు వచ్చింంది. కానీ చివరికి ఏమీ లేదని తేల్చారు. దీంతో టాలీవుడ్‌కు నాలుగైదేళ్లుగా పట్టుకున్న డ్రగ్స్ టెన్షన్ తీరిపోయిటన్లయింది.