ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. ఆయన అన్ని రకాల జోనర్లనీ టచ్ చేశారు. ప్రస్తుతం ఆయన దృష్టి శంకరాచార్య పాత్రపై పడింది. హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి. అతని జీవితాన్ని తెరపై చూపించాలన్నది బాలకృష్ణ ప్రయత్నం. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా తయారవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి సి.కల్యాణ్ కూడా సముఖంగా ఉన్నారు. బాలయ్యతో కల్యాణ్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలొచ్చాయి. మూడో సినిమా కోసం కూడా ప్లాన్ చేశారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు.
”బాలకృష్ణ డ్రీ మ్ ప్రాజెక్ట్… శంకరాచార్య. అందుకోసం స్క్రిప్టు ప్రిపేర్ అవుతోంది. బాలయ్య అనుమతి ఇస్తే.. ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ గా ఉంటా” అని సి.కల్యాణ్ ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సో…బాలయ్య రాబోయే చిత్రాల్లో దీన్ని కూడా చేర్చవచ్చన్నమాట. మరి దర్శకుడెవరో తేలాల్సివుంది.