డిసెంబర్ 13 కేసీఆర్ సీఎంగా రెండో సారి ప్రమాణం చేసిన రోజు. ఆ రోజు మూడో సారి వచ్చింది. ఎప్పుడు డిసెంబర్ 13 వచ్చినా టీఆర్ఎస్ నేతల్లో ఓ జోష్ కనిపించేది. పేపర్ ప్రకటనలు..కేక్ కట్టింగ్లు..ర్యాలీలు..ఇలా హోరెత్తిపోయేది. తాము బంగారు తెలంగాణ దిశగా ఎలా తీసుకెళ్తున్నామో టీఆర్ఎస్ చెప్పేది.కానీ ఈ సారి ఒక్కరంటే ఒక్కరు కూడా పాలనను స్మరించుకోలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందనే విషయాన్ని కూడా మర్చిపోయారు.
మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ ప్రెస్‌మీట్ పెట్టి కూడా మాట్లాడలేదు. కనీసం పార్టీ చేపట్టిన అభివృద్ధిని వివరించే నాయకులు సైతం కనిపించలేదు. 100మందికిపైగా శాసనసభ్యులు ఉన్నప్పటికీ వారివారి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై కూడా మాట్లాడలేదు. మంత్రి కేటీఆర్ తమిళనాడుకు వెళ్లే ముందు సనత్ నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ మూడేళ్ల ప్రస్తావనపై ప్రసగించలేదు. కనీసం తెలంగాణ భవన్ లోనైనా మూడేళ్ల కార్యక్రమంపై ఎలాంటి సంబురాలు నిర్వహించలేదు. దీనికి తోడు పార్టీ శ్రేణులకు సైతం ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు..
సహజంగానే పార్టీ నుంచి ఆదేశాలు వస్తేనే స్పందిస్తారు. అలాంటిదేమీ లేకపోవడంతో ఎవరూ స్పందించలేదని చెబుతున్ారు. కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో పార్టీ నేతలకు అర్థం కాలే్దు. ఆయన ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. అయితే ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు ఉన్నా.. యానివర్శరీలు కూడా చేసుకోకపోతే.. క్యాడర్లో ఓ రకమైన నిర్లిప్తత పెరుగుతుదని.. నేతలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి బాగోలేదుకాబట్టే సైలెంటయ్యామని అనుకుంటున్నారు.