”డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే” అని వ్యాఖ్యానించాడు నాని. విడుదలకు సిద్దమౌతున్న నాని సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. డిసెంబర్ 24న విడుదల ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని వరంగల్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్ సినిమా అదే ఆనందం వుంది. రాహుల్ చేసిన మొదటి సినిమాను నేను చూడలేదు. కానీ ఈ రోజు నా సినిమాను చూశాను. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది” అని చెప్పుకొచ్చాడు నాని.
”అరేయ్ నాన్న.. నేను నీ ఒక్కడికే ఫ్యాన్ అని సిరివెన్నెల అనేవారు. ఆయనకు ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూపించాం. పాటలు రాయమని అన్నాం. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదురా.. నాకు ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని ఉందిరా అని అనేవారు. ఆయనకు ఆ సినిమాను అప్పుడే చూపించాల్సింది. కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీర్వాదం మాతోనే ఉంటుంది. ఆయన చివరి పాట శ్యామ్ సింగ రాయ్ కోసం రాయడంతో ఈ సినిమా మరింత స్పెషల్” అని సిరివెన్నెలనిగుర్తు చేసుకున్నాడు నాని.
”సాయి పల్లవి మంచి డ్యాన్సర్. ఇందులో మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. నిర్మాత వెంకట్ గారితో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సినిమాలో పనిచేసిన అందరూ కష్టపడ్డారు కాబట్టే ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. రెండేళ్ల తరువాత థియేటర్లోకి వస్తున్నా.. ఈ డిసెంబర్ 24న టాప్ లేచిపోవాల్సిందే” అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు నాని.