ఉద్యోగుల్లో మంట పెట్టిన పీఆర్సీ వ్యవహారంపై మరికొంత కాలం సాగదీసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అసలు పే రివిజన్ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం కార్యదర్శుల కమిటీతో సొంత పీఆర్సీ నివేదిక ఇప్పించింది. వాటినే ఆన్ లైన్లోకి అప్ లోడ్ చేసింది. తమకు ఫేవర్‌గా ఉంటారనుకున్న ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి మాట్లాడుతోంది. సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం తర్వాత ఆయన ఖరారు చేస్తారని.. దానికి 72iగంటలు పట్టవచ్చని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు.
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. బుధవారం ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం ఉంటుందన్న ప్రచారం జరిగింది. కానీ.. బుధవారం లేదని.. త్వరలో ఉంటుందనే సమాచారం పంపారు. కార్యదర్శుల కమిటీలో ప్రధాన అంశమైన 14.29 ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు. ఎందుకంటే ఇప్పటికే మధ్యంతర భృతి 27 వస్తోంది. కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసిన దానికి అంగీకరిస్తే జీతం తగ్గుతుంది.
ఇలా జీతం తగ్గించవద్దు మహా ప్రభో అని వేడుకుని చివరికి.. ఉన్న జీతంతో సంతృప్తి పడేలా ఉద్యోగుల్ని బ్లాక్ మెయి్ చేయడమే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక వ్యూహమని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎంతో సమావేశం తర్వాత ఓ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ ఈ వివాదాన్ని పీక్స్‌కు తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.