పాదయాత్రతో అనుకున్నంత మైలేజీ రావట్లేదని అనుకున్నారమో కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్పు యాత్ర ప్రారంభిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం ఊరేగింపుగా వెళ్లి .. ఓదార్పు యాత్ర చేసి జగన్ చరిత్ర సృష్టించారు . ఇప్పుడు అలాంటి అవకాశమే మళ్లీ షర్మిల సృష్టించుకున్నారు. అయితే గతంలో జగన్ తన తండ్రి కోసం మరణించిన వారంటూ సిద్దం చేసుకున్న జాబితా ప్రకారం వెళ్లారు. కానీ షర్మిల మరీ ఆనాటి జాబితా అయితే వర్కవుట్ కాదని అనుకున్నారు. అందుకే లెటెస్ట్ గా ఆమె రైతు ఆత్మహత్యల జాబితాను తీసుకున్నారు.
గత 70 రోజుల్లో 200 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారని లెక్క చెప్పిన షర్మిల.. అందర్నీ రైతు ఆవేదనా యాత్ర పేరుతో పరామర్శిస్తానని ప్రకటించారు. దీన్ని ఈ నెల 19న ప్రారంభిస్తున్నారు. సహజంగా ఓదార్పు యాత్ర స్టైల్ ప్రకారం.. ఒక్కొక్కరి పరామర్శకు ఒక్కో రోజు తీసుకుంటారు.ఈ కారణంగా చూస్తే వచ్చే ఏడాది మొత్తం షర్మిల రైతు ఆవేదనయాత్రకే సమయం కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యాత్రను ఎన్నికల కోడ్ పేరుతో నల్లగొండ జిల్లాలోనే ఆపేశారు.
ఒక వేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఈ యాత్రతోనే ముగిస్తారు. అంటే పాదయాత్ర ఉండకపోవచ్చన్నమాట. ఒక వేళ2023 చివరిలోనే ఎన్నికలుఉంటే.. పరిస్థితిని బట్టి పాదయాత్ర ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాదయాత్ర చేస్తే అధికారం గ్యారంటీ అని ఆశలు పెట్టుకున్న షర్మిల ఫ్యాన్స్‌కు ఆ పాదయాత్రకు మధ్యలోనే మంగళం పాడటం .. నిరాశ పరుస్తోంది.